పర్వతాలెక్కడానికి సాయం చేసిన హీరో..

  • September 19, 2022 / 08:13 PM IST

పర్వతాలను అధిరోహించడం అనేది ఒక కల. ప్రపంచం లో చాలామంది ఈ ఫీట్ చేస్తూ గిన్నిస్ రికార్డులకు ఎక్కారు. రికార్డులకు మాత్రమే కాదు వారి అభిరుచుల కొరకు వారు ఈ విధంగా చేస్తుంటారు. ఇలాంటి రంగంలో ఒక తెలుగు కుర్రాడు ఉండడం నిజంగా మంచి విశేషం అనే చెప్పాలి. తెలంగాణ లోని మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ లో మరిపెడ మండలం లో యశ్వంత్ అనే ఓ కుర్రాడు ఈ విధంగా పలు ఘనతలను సాధించాడు.

అయితే తాజాగా యూరప్ లోని రష్యా లో అత్యధిక ఎత్తు కలిగిన ఎల్బర్స్ పర్వతాన్ని అధిరోహించాలని భావించాడు. అయితే తన ప్రయాణానికి నిధులు లేకపోవడం అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో మంచి హృదయంతో కళను పోషించాలనే ఉద్దేశ్యంతో  ఈ యువకుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు ప్రముఖ హీరో, వ్యాపారవేత్త అభినవ్ సర్దార్. ది ఘోస్ట్ రిసార్ట్, రాక్షసి, మాగ్నెట్,  రామ్ అసుర్ వంటి పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న అభినవ్ సర్దార్ ఇప్పుడు కూడా కొన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

మొదటి నుంచి ఆయన కళాకారులను పోషించే తత్వం ఉన్న వ్యక్తి. అందులో భాగంగానే యశ్వంత్ కు సహాయం చేసి ఓ మంచి పనికి పునాది వేశాడు. దేశం యొక్క ప్రతిష్టను విదేశీ గడ్డపై నిలిపేందుకు తన వంతు సహాయం చేశాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సినిమా రామ్ అసుర్ ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆయన నటనకు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus