ఎన్టీఆర్ పై పోసాని షాకింగ్ కామెంట్స్?

కథా రచయితగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకి రైటర్ గా పనిచేసాడు పోసాని కృష్ణమురళి. తరువాత నటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు కానీ ఎక్కువ అవకాశాలు అయితే వచ్చేవి కాదు. ఇక డైరెక్టర్ గా కూడా మారి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ వచ్చాడు. అయితే అందులో ఒకటో రెండో హిట్టయ్యాయి. అయితే ‘ఏక్ నిరంజన్’ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ‘నాయక్’ వంటి చిత్రాలలో తన కామెడీ తో వరుస అవకాశాలు దక్కించుకుంటూ వచ్చాడు. ఇక పోసాని సమకాలీన రాజకీయాల పై కూడా తన గళాన్ని వినిపిస్తుంటాడు. ఇటీవలే చిన్నపాటి సర్జరీ చేయించుకున్న పోసాని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానాలిచ్చాడు పోసాని… జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి టీడీపీ పగ్గాలు వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం పై ఆయన స్పందిస్తూ.. “జగన్మోహన్ రెడ్డిగారి పరిపాలన బాగోలేనప్పుడు .. అంతా అవినీతిమయమైపోయినప్పుడు మాత్రమే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ కైనా .. జూనియర్ ఎన్టీఆర్ కైనా ఒక ప్లేస్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వరు. హీరో ఇమేజ్ వేరు .. రాజకీయాలు వేరు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి చిత్తశుద్ధితో వచ్చినా ఇక్కడ ఆయన బండి నడవదు. ఒక హీరో వచ్చి ఆకాశంలో నుంచి చుక్కలు తీసుకొస్తానంటే నమ్మే రోజులు పోయాయి. ఎవరు ఏ ఉద్దేశంతో తమ మధ్యలోకి వచ్చేశారనేది జనం కనిపెట్టేశారు” అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus