తనకు సూటయ్యే పనులను మాత్రమే పవన్ చేస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తానూ చేయగలిగే పాత్రలు తప్ప, ఎంత గొప్ప పాత్రలు వచ్చినా నిర్మొహమాటంగా తిప్పి కొడతానని పలు సందర్భాలలో స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారు. అలాగే తన అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్దని చెప్పినా గానీ, రాజకీయాల్లోకి వచ్చారు పవన్.
అలా తన మనస్సాక్షి చెప్పింది చేయడమే తప్ప, వేరేవారి మాట పవన్ కళ్యాణ్ వినడనే విషయం బహిరంగ సత్యమే. అలాంటి పవన్ ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చాడు.