సినిమాలో సన్నివేశాలు బాగా రావాలని దర్శకులు తపిస్తుంటారు. అందుకు తగ్గట్లు నటీనటులు కష్టపడుతుంటారు.వారు శ్రమించిన సంగతులు వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. బాహుబలి బిగినింగ్ చిత్రంలో ప్రభాస్ శివలింగాన్ని భుజాన ఎత్తుకునే సీన్ అందరికీ గుర్తుంటుంది. అందుకోసం డార్లింగ్ చాలా ఎక్కువగా కష్టపడ్డారు. బరువైన శివలింగాన్ని ఎక్కువ సేపు మోయడంతో భుజానికి గాయం అయింది. అందుకోసం ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది. రెండు నెలలు రెస్ట్ తీసుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వృత్తి పట్ల నిబద్ధతో ఉంటారు. టెంపర్ లో “మీ తాత టెంపర్” అనే పాట షూటింగ్ అప్పుడు తారక్ ఫుల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నా యాక్షన్ అనగానే అద్భుతమైన స్టెప్పులు వేసి మెప్పించారు. డ్యాన్స్ పైన తన ప్రేమని చాటుకున్నారు. అల్లరి నరేష్ మరో విధంగా వృత్తి పట్ల అంకితభావాన్ని చాటుకున్నారు. తన పుట్టినరోజు అయినప్పటికీ ఆ రోజు చచ్చిపోయే సన్నివేశంలో నటించారు. గమ్యంలో అతను చేసిన ఈ సీన్ అందరినీ కంటతడి పెట్టించింది. గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వుకేక పాట తర్వాత రౌడీలా జీప్ లను ఆపే సీన్లో కనిపించే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కాదు.. హరీష్ శంకర్. ఎటువంటి డౌట్ రాకుండా పోలీస్ యూనిఫామ్‌లో పవన్ లాగా నిలబడి డైరక్టర్ వావ్ అనిపించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.