Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movies » Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

  • October 23, 2026 / 01:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

సాధారణంగా స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు అంటేనే ఇండస్ట్రీ కానీ, ఫ్యాన్స్ కానీ సీరియస్ గా తీసుకుంటారు. వెంటనే ఆ హీరోని ఓన్ చేసుకుంటారు. ఆ హీరోకి సక్సెస్ అందించే వరకు ఫుల్ గా డ్యూటీ చేస్తారు. కానీ ఆ స్టార్ తమ్ముడి కొడుకు, అన్న కొడుకు అంటే సదరు హీరో ఫ్యాన్స్ వెంటనే ఓన్ చేసుకోవడం కష్టం. సరిగ్గా ఇలానే ప్రభాస్ కెరీర్ స్టార్టింగ్లో జరిగింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు సోదరుడు సూర్య నారాయణ రాజు తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు ప్రభాస్(Prabhas).

Prabhas

పైగా కృష్ణంరాజు అప్పటికే హీరోగా ఫేడౌట్ అయ్యి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న రోజులు అవి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కృష్ణంరాజుకి సినిమాలు తగ్గిపోయాయి. అలాంటి టైమ్లో ప్రభాస్ ని హీరోగా లాంచ్ చేశారు. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘ఈశ్వర్’ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఎక్కువ శాతం భీమవరం బ్యాచే ఓపెనింగ్ కి వచ్చింది. ‘టక్కరి దొంగ’ డిజాస్టర్ అవ్వడంతో ‘ఈశ్వర్’ సినిమాకి పెద్దగా బజ్ రాలేదు. పైగా సోమవారం నాడు రిలీజ్ చేయడం వల్ల సినిమాకి భారీ ఓపెనింగ్స్ కూడా రాలేదు.

కాకపోతే తక్కువ బడ్జెట్లో తీయడం.. చాలా వరకు నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకోవడం వల్ల ఆ సినిమా.. అటు బయ్యర్స్ కి, ఇటు నిర్మాతకి కొద్దిపాటి ప్రాఫిట్స్ ను అందించింది. అయితే హీరోగా ప్రభాస్ కి రావాల్సిన అప్రీసియేషన్ వెంటనే రాలేదు. తర్వాత చేసిన ‘రాఘవేంద్ర’ సైతం నిరాశపరిచింది. ఇలాంటి టైమ్లో ‘వర్షం’ తో ఓ సాలిడ్ కొట్టాడు ప్రభాస్. ఆ సినిమా ప్రభాస్ కి లవర్ బాయ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. తర్వాత మాస్ ఇమేజ్ కోసం చేసిన ‘అడవి రాముడు’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.

దీంతో తనకి మాస్ సెట్ కాదేమో అని భావించి ‘చక్రం’ చేశాడు ప్రభాస్. అది కూడా నిరాశపరిచింది. అలాంటి టైమ్లో ‘ఛత్రపతి’ వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ఈ సినిమా.. మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఆరా అంటే ఏంటో చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. అలా అని ‘ఛత్రపతి’ ఇమేజ్ కే స్టిక్ అయ్యి సినిమాలు చేయాలని ప్రభాస్ అనుకోలేదు. వెంటనే ‘పౌర్ణమి’ అనే పీరియాడిక్ సినిమా చేశాడు. అయితే ‘పౌర్ణమి’ నుండీ ‘మున్నా’ వరకు ప్రభాస్ ను ఫ్లాపులు వెంటాడాయి.

అలాంటి టైమ్లో ప్రభాస్ కెరీర్ పైనే చాలా అనుమానాలు రేకెత్తాయి. ప్రభాస్ రొటీన్ అయిపోతున్నాడు అని, కొత్తగా చేయడం లేదని ఇలా ఏవేవో కామెంట్లు వచ్చాయి. ఆ టైమ్లో కృష్ణంరాజు ఇమేజ్ కూడా ప్రభాస్ కెరీర్..కి హెల్ప్ అవ్వలేదు. కొత్త హీరోలానే కష్టపడాల్సి వచ్చింది. మరోవైపు మిగతా హీరోలంతా దూసుకుపోతున్నారు. కొత్తగా వచ్చిన స్టార్ హీరోల వారసులు సైతం వరుస హిట్లు కొట్టి బిజీ అయిపోయారు. ఇలాంటి టైమ్లో పూరీ జగన్నాథ్ తో చేతులు కలిపి ‘బుజ్జిగాడు’ సినిమా చేశాడు ప్రభాస్.

ప్రభాస్ లోని కొత్త డైమెన్షన్ ను పరిచయం చేసింది ‘బుజ్జిగాడు’ సినిమా. డార్లింగ్ అంటూ ప్రభాస్ ను అంతా ఓన్ చేసుకునేలా చేసిన సినిమా ఇదే. కానీ కమర్షియల్ గా ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సినిమా టైమ్లో ‘ప్రభాస్ కి హిట్లు పడవు.. ఇక వేస్ట్’ అంటూ యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్లు చేశారు. తర్వాత వచ్చిన ‘బిల్లా’ బాగానే ఆడినా, ‘ఏక్ నిరంజన్’ నిరాశపరిచినా.. ప్రభాస్ కి అవసరమైన హిట్ ఇచ్చింది ‘డార్లింగ్’ సినిమా అనే చెప్పాలి.

‘డార్లింగ్’ సినిమాతో ప్రభాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సూపర్ హిట్ అయ్యింది. ‘రెబల్’ కి నెగిటివ్ టాక్ వచ్చినా బాగానే ఆడింది. ‘మిర్చి’ అయితే ప్రభాస్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది. ప్రభాస్ కటౌట్ ని వాడుకుని ఎలా హిట్ కొట్టొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జామ్పుల్ గా ‘మిర్చి’ సినిమాని చెప్పుకోవచ్చు. కొరటాల శివ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ‘బాహుబలి’ చేశాడు.

ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు ప్రభాస్. ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. ప్రభాస్ లేకుండా ఈ సినిమాని ఊహించలేం. కొంతమంది ‘బాహుబలి’ సక్సెస్ క్రెడిట్ ఎక్కువ శాతం రాజమౌళికే దక్కుతుంది అంటూ కామెంట్లు చేస్తారు. కానీ అది వట్టి అపోహే అని తర్వాత వచ్చిన ‘సలార్’ ‘కల్కి 2898 AD’ సక్సెస్..లు ప్రూవ్ చేశాయి. ఇప్పుడు ‘స్పిరిట్’ ‘కల్కి 2’ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. ఇవి కూడా రూ.1000 కోట్ల సినిమాలుగా నిలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

ప్రభాస్ కెరీర్ ను చూసుకుంటే.. అతని కెరీర్లో ఎన్ని ఫ్లాపులు వచ్చినా, అతని ఇమేజ్ కి ఎంత మాత్రం ఎఫెక్ట్ పడలేదు. క్లాస్, మాస్, ఫ్యామిలీస్ ఎలా చూసుకున్నా ప్రభాస్ కి తిరుగులేని స్టార్ డమ్ ఉంది. ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు అతను వేస్ట్ అంటూ కామెంట్లు చేసిన వాళ్ళు సైతం ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. అతని సక్సెస్ రేంజ్ మరింత పెరగాలని ఈరోజు 47వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభాస్ కి బెస్ట్ విషెస్ ను తెలియజేస్తుంది ఫిల్మీ ఫోకస్ యూనిట్.

‘హ్యాపీ బర్త్ డే ప్రభాస్’

అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas Birthday Special

Also Read

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

related news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

54 mins ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago

latest news

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

4 seconds ago
Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

47 mins ago
Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

1 hour ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

22 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version