Prabhas, Pawan Kalyan: పవన్ సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ ని అందుకోలేకపోతున్న ‘ఛత్రపతి’అడ్వాన్స్ బుకింగ్స్..!

గత రెండు సంవత్సరాల నుండి మన టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల జోరు ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రతీ దానికి ఒక అంతం అనేది ఉంటుంది. గడిచిన రెండు సంవత్సరాలలో కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్స్ కి జనాలు ఎలా అయితే క్యూ కట్టేవారో, రీ రిలీజ్ సినిమాలకు అదే రేంజ్ లో క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు నెమ్మదిగా రీ రిలీజ్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోతూ వస్తుంది.

అందుకు ఉదాహరణ రేపు ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ కాబోతున్న ఛత్రపతి సినిమా. (Prabhas) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ‘ఛత్రపతి’ సినిమాని లేటెస్ట్ 4K కి మార్చి రీ రిలీజ్ చెయ్యడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ లో మునుపటి రేంజ్ జోష్ లేదు. చాలా మందికి ఈ సినిమా విడుదల అవుతున్నట్టు తెలియదు కూడా.

అందుకే ఈ చిత్రానికి మొదటి రోజు కోటి రూపాయిల కంటే తక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఏడాది సరైన ప్లానింగ్ లేకుండా విడుదలైన పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రానికి కేవలం మొదటి రోజే కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో దాదాపుగా రెండు కోట్ల 50 లక్షల రూపాయిల వరకు గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ కలెక్షన్స్ ని ఛత్రపతి సినిమా అందుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం ‘దసరా’ కి కొత్త సినిమాల హవా నడుస్తుండడం, దానికి తోడు ఛత్రపతి సినిమాకి ఫ్యాన్స్ అనుకున్న స్థాయిలో ప్రొమోషన్స్ చెయ్యకపోవడం వల్లే సినిమాకి ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదని, మొదటి రోజు కోటి రూపాయిల కంటే తక్కువ గ్రాస్, అలాగే ఫుల్ రన్ లో కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus