Prabhas: సలార్2 అప్పుడే.. ఫ్యాన్స్ కు స్టార్ హీరో ప్రభాస్ క్లారిటీ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు కలెక్షన్లు సైతం భారీ స్థాయిలో వస్తున్నాయి. ప్రభాస్ ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులు సంతోషించే విషయాలను వెల్లడిస్తున్నారు. సలార్2 మూవీ స్క్రిప్ట్ పూర్తైందని ప్రభాస్ పేర్కొన్నారు. త్వరలోనే సలార్2 మూవీ షూట్ మొదలుకానుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా సీక్వెల్ కోసం నా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.

మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ అప్ డేట్స్ ఇస్తామని ప్రభాస్ చెప్పుకొచ్చారు. నాకు విభిన్న నేపథ్య కథల్లో నటించాలని ఉందని ఆయన కామెంట్లు చేశారు. ప్రేక్షకుల నుంచి సలార్ మూవీకి వచ్చిన స్పందన నా తర్వాత సినిమాలకు సైతం వస్తుందని ఫీలవుతున్నానని ఆయన పేర్కొన్నారు. సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం కొనసాగిస్తోంది. సలార్ మూవీ 12 రోజుల్లో 307 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

మరో 30 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీకెండ్ కలెక్షన్లు కూడా యాడ్ అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పవచ్చు. సలార్2 మూవీ శౌర్యాంగ పర్వం పేరుతో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సలార్2 మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే ఛాన్స్ ఉంది.

సలార్1 నచ్చిన వాళ్లు సలార్2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. సలార్2 మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus