Prabhas: ప్రభాస్ కెరియర్ లో తక్కువ డైలాగ్స్ చెప్పిన సినిమా ఇదేనా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ అదిరిపోయింది ప్రభాస్ కటౌట్ చూసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి పెద్దగా డైలాగ్స్ లేవని ముఖ్యంగా ప్రభాస్ కి ఒక పవర్ఫుల్ డైలాగ్ కూడా లేదనే చెప్పాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి ఒక్క పవర్ఫుల్ డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ తన కటౌట్ ద్వారా సినిమాని సక్సెస్ చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించవు సెకండ్ హాఫ్ లో మాత్రమే కొన్ని కొన్ని డైలాగ్స్ అది కూడా సింపుల్ డైలాగ్స్ మాత్రమే చెప్పారు.

మరి ఈ సినిమాలో ప్రభాస్ మొత్తం ఎన్ని డైలాగ్స్ చెప్పారనే విషయానికి వస్తే సినిమా మొత్తం కలిపి ప్రభాస్ కేవలం 38 డైలాగ్స్ మాత్రమే చెప్పారట. అదికూడా పగిలిపోతుంది, సారీ అలా చిన్న చిన్న డైలాగ్స్ మాత్రమే ఈయన చెప్పారని తెలుస్తోంది. ఇలా ప్రభాస్ ఇప్పటివరకు తన సినీ కెరియర్ లో నటించిన సినిమాలలో చాలా తక్కువ డైలాగ్స్ చెప్పిన సినిమాగా సినిమా నిలిచిందనే చెప్పాలి.

డైలాగ్స్ లేకపోయినా ఈ సినిమా మాత్రం మంచి సక్సెస్ అందుకోవడం విశేషం. అయితే పార్ట్ వన్ ఇలా ఉన్నప్పటికీ పార్ట్ 2 లో మాత్రం ప్రభాస్ (Prabhas) పాత్రకు చాలా ఇంపార్టెంట్ ఉండబోతుందని ఈ సినిమా క్లైమాక్స్ ద్వారా డైరెక్టర్ హింట్ ఇచ్చారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus