Prabhas: ప్రేక్షకులందర్నీ భావేద్వేగానికి గురిచేస్తున్న కృష్ణంరాజు, ప్రభాస్ వీడియో..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరనే మాట తెలుగు ప్రేక్షకులు, అభిమానులు ఇంకా నమ్మలేకపోతున్నారు.. ఆయన నట వారసుడు ప్రభాస్‌కి పెదనాన్న లేని లోటనేది తీరనిది.. ఇప్పుడాయన స్థానంలో ఉండి కుటుంబ బాధ్యతలు, చెల్లెల్ల పెళ్లిళ్లు వంటివన్నీ డార్లింగే చూసుకోవాలి.. పాన్ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.. సాధారణంగా మీడియా ముందు కనిపించడానికి కాస్త ఇబ్బంది పడే ప్రభాస్.. ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా దుమ్ము దులుపుతున్న ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 కి వచ్చాడు.

తనతో పాటు ఫ్రెండ్ గోపిచంద్ కూడా రావడం.. షూటింగ్ అప్పటి నుండే ఆన్ లొకేషన్ పిక్స్, వీడియోస్ లీకై నెట్టింట ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో తెలిసిందే.. డార్లింగ్ పోగ్రామ్‌ని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రోమోస్, ఎపిసోడ్స్ భారీ స్థాయిలో వ్యూవర్ షిప్ దక్కించుకున్నాయి. ప్రభాస్‌ని చాలా రోజుల తర్వాత ఇలా సంతోషంగా చూడడం అందరికీ హ్యాపీగా అనిపించింది.. చాలా సరదాగా, చిన్న పిల్లాడిలా మారాం చేస్తూ..

తనపై బాలయ్య బాబుకి చాడీలు చెప్తున్న రామ్ చరణ్, గోపిచంద్‌లను దబాయించడం, బుంగమూతి పెట్టడం.. బాలయ్యకే కౌంటర్ వెేయడం వంటివి ఫ్యాన్స్, ఆడియన్స్‌కి భలే అనిపించాయి.. బాలయ్య పెళ్లి గురించి, హీరోయిన్ల గురించి అడిగినప్పుడు డార్లింగ్ సిగ్గు పడడం అమ్మాయిలకు విపరీతంగా నచ్చేసింది.. ఇక సెకండ్ ఎపిసోడ్‌లో ఫ్యాన్స్ కృష్ణంరాజు, ప్రభాస్‌ల సినిమాల్లోని సన్నివేశాలను పక్కపక్కన పెట్టి ఎడిట్ చేసిన వీడియో ప్లే చేసినప్పుడు అంతా అలా చూస్తూ ఉండిపోయారు..

అద్భుతంగా ఎడిట్ చేసిన ఆ వీడియోలో పెదనాన్న సినిమాలతో తన సినిమాలను కంపేర్ చేయడం చూసి ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు.. ఆ వీడియో చూసి అభిమానులు, ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.. రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ మీద ప్రేమాభిమానులతో ఫ్యాన్స్ రూపొందించిన ఈ అపురూపమైన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.. ఫ్యాన్స్ దీన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus