Prabhas: శృతిహాసన్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం: రాజమౌళి

  • December 20, 2023 / 08:36 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమాపై అభిమానులు అంచనాలు పెంచుకోవడమే కాకుండా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో భాగంగా ప్రభాస్ మరియు ఇతర చిత్ర బృందం కూడా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి సలార్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో భాగంగా సలార్ సినిమాలో శృతిహాసన్ పాత్ర గురించి ప్రభాస్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇదివరకు విడుదలైనటువంటి టీజర్లలో శృతిహాసన్ కేవలం ఒక డైలాగ్ కి మాత్రమే పరిమితం అవుతూ కనిపించారు అయితే సినిమా మొత్తం పెద్దగా ఉండదు అన్న సందేహాలు కూడా అందరికీ ఎదురయ్యాయి.

ఇక ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందంటూ ప్రభాస్ ఆమె పాత్ర గురించి తెలియజేశారు.తల్లి పాత్రకి తనకి, శృతి హాసన్ కి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ హైలైట్ అవుతాయని ప్రభాస్ పేర్కొన్నాడు. ఇక రాజమౌళి కూడా ఈ విషయంపై స్పందిస్తూ శృతిహాసన్ డాన్స్ చాలా బాగా చేస్తుందని ఆ అమ్మాయి డాన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ తెలిపారు.

ఇక ప్రభాస్ (Prabhas) శృతిహాసన్ అంటే కచ్చితంగా వీరి మధ్య ఉంటుందని అభిమానులు భావిస్తారు ఎందుకు లేదని కూడా ఈయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ప్రశాంత్ సమాధానం చెబుతూ ఈ సినిమాలో డ్రామానే ఎక్కువగా ఉంటుంది హీరోయిన్ పాత్రను కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం చేయాలనుకోవడం లేదు అందుకే పెట్టడం కుదరలేదని ప్రశాంత్ తెలిపారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus