కృతి సనన్ .. ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది కానీ, ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా ఆమె మంచి మార్కులు వేయించుకుంది కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. అటు తర్వాత నాగ చైతన్య హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘దోచేయ్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా నిరాశపరిచింది.
దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు రాలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ చెక్కేసి అక్కడ సినిమాలు చేసుకుంది. బాలీవుడ్లో మాత్రం ఈమెకు విజయాలు వరించాయి. కాకపోతే అక్కడ ఈమె చేసిన పాత్రలన్నీ గ్లామర్ రోల్స్ అనే చెప్పాలి. బోల్డ్ సన్నివేశాల్లో కూడా మొహమాటం లేకుండా నటిస్తుంది. అయితే కృతి సనన్ ను ‘ఆదిపురుష్’ లో సీత పాత్రకి ఎంపిక చేసుకున్నప్పుడు చాలా మంది విమర్శలు గుప్పించారు. సీతాదేవి విలువ తెలీకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించకూడదు అంటూ ఓ రేంజ్లో మండిపడ్డారు.
కానీ కృతి సనన్ గొప్ప నటి. అందులో ఎలాంటి డౌట్ లేదు. బాలీవుడ్ లో ఉన్న అలియా భట్ వంటి హీరోయిన్ల కంటే కూడా బాగా నటించగలదు. అందుకే ఓం ఎంపిక చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. ‘నిన్న తిరుపతిలో జరిగిన ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే (Prabhas) ప్రభాస్ … ‘కృతి సనన్ ను ప్రజలు వెంటనే సీతగా అంగీకరించారు’ అంటూ చెప్పాడు. అందులో మాత్రం నిజం లేదు.
ఇప్పటికీ కృతి సనన్ ను సీత పాత్రకు ఎంపిక చేసుకోవడం పై నెగిటివ్ కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ కు ఆ నెగిటివిటీ గురించి తెలీదో లేక కృతి శెట్టిని వెనకేసుకొచ్చాడో తెలీడం లేదు. ఒక్కటైతే నిజం..కృతి సనన్ .. ఎక్స్ ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేయగల నటి. ట్రైలర్స్ లో, ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో ఆమె ఎక్స్ప్రెషన్స్ గమనించిన వారికి ఇది అర్ధమవుతుంది.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు