అమ్మాయిల్లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తో ఎంతోమందికి కలల రారాజు అయ్యారు. తమ డ్రీమ్ బాయ్ గా డార్లింగ్ మారారు. అయితే యువతుల కలలపై ప్రభాస్ నీళ్లు చల్లనున్నారు. తన బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అతని కోసం బాబాయ్, రెబెల్ స్టార్ కృష్ణంరాజు విశాఖ పట్టణం,భీమవరం లలో ఇప్పటికే కొన్ని సంబంధాలను చూసి పెట్టి ఉన్నారు.
ప్రభాస్ ఆ అమ్మాయిలను చూసి ఒకే చెప్పడమే తరువాయి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ షూటింగ్ లో ఉన్నారు. రెండు పాటలను పూర్తి చేస్తే షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుంది. దీని తరవాత తన జోడీని సెలక్ట్ చేసుకునే పనిలో పడనున్నారు. అంతా అనుకున్నట్లు సాగితే ప్రభాస్ పెళ్లిని వచ్చే ఏడాది మార్చిలో జరిపించేందుకు కృష్ణంరాజు సిద్ధంగా ఉన్నారు. అంటే బాహుబలి కంక్లూజన్ రిలీజ్ కి ముందే డార్లింగ్ అభిమానులకు పండుగ రానుందన్నమాట.