యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.’జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో … ప్రేమ కథ ఇప్పటి వరకూ మనం చూసిన ప్రేమకథా చిత్రాల్లా కాకుండా… ఎంతో సెన్సిబుల్ అండ్ మెట్యూర్డ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రం ఎక్కువ శాతం యూరప్ లోనే చిత్రీకరించనున్నారట.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం … తాజా షెడ్యూల్ ను జార్జియాలో పూర్తి చేసినట్టు దర్శకుడు తన ట్విట్టర్ లో తెలిపాడు. పీరియాడిక్ నేపధ్యంలో సాగే లవ్ స్టోరీ కాబట్టి…హీరో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.ఈ చిత్రం పూర్తిగా 1960ల నాటి కాలంలో సాగే ప్రేమ కథ కావడంతో ప్రభాస్ మరియు పూజ లుక్స్ అప్పటి ట్రెండ్ కు తగినట్టుగా ఉంటాయనేది తాజా సమాచారం.
వారి డ్రెస్ లు కూడా అప్పటికి తగినట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నాడట దర్శకుడు. అందులోనూ హీరో ప్రభాస్ లుక్ ఎంతో వైవిధ్యంగా గత చిత్రాలలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని సమాచారం. చెప్పాలంటే ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. జగపతి బాబు, భాగ్య శ్రీ వంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.