Prabhas: ఎలాగోలా హిట్ చేసేయ్యండి డార్లింగ్స్.. ప్రభాస్ రిక్వెస్ట్!

ప్రతి హీరో అలాగే ప్రతి దర్శకుడు కూడా వారి సినిమాను మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా చాలా నమ్మకంతో సినిమా కోసం కష్టపడుతూ ఉంటారు. అంతే కాకుండా ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం తోనే ముందుకు సాగుతూ ఉంటారు. సినిమా చూసిన తర్వాత కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. కానీ థియేటర్స్ లోకి వచ్చేసరికి మాత్రం చాలాసార్లు వారి అంచనాలు తలక్రిందులు అయ్యే అవకాశం ఉంటుంది.

Click Here To Watch Now

ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ఎలా వచ్చిందో తెలియదు గాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం చాలా టెన్షన్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆఖరికి రాజమౌళికి సినిమా చూపించి ఎడిటింగ్ లో కీలక మార్పులు చేయమని ప్రభాస్ కూడా కోరినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే రీసెంట్గా ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూ లలో సినిమా రిజల్ట్ పై చాలా టెన్షన్ లో ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ సినిమాలు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయని

ఆ సినిమాలను ఎలా చూసారో ఇప్పుడు రాధే శ్యామ్ ను కూడా అలానే చేసేయండి అంటూ ఈ సినిమాను కూడా ఎలాగోలా హిట్ చేసేయండి అని కూడా ప్రభాస్ కోరడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ సినిమాను కూడా ఎలాగోలా హిట్ చేసేయండి డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ను కోరడం వైరల్ గా మారింది. సినిమాకు పెట్టిన పెట్టుబడి ప్రభాస్ కొంచెం టెన్షన్ లో ఉన్నట్లు అర్థమవుతోంది.

సినిమా కోసం నిర్మాతలు 300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను మొదట కేవలం వందకోట్ల లోపే పూర్తి చేయాలని ప్రభాస్ అనుకున్నారట. కానీ యూవీ క్రియేషన్స్ మాత్రం చాలా గ్రాండ్ గా తెరకెక్కించాలని లెక్కకు మించి ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ టెన్షన్ పోదు అని చాలా ఇంటర్వ్యూలలో చెబుతున్నాడు. మరి సినిమా శుక్రవారం ఉదయం ఎలాంటి టాక్ తో మొదలవుతుందో చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus