రాజమౌళి శిష్యుడితో ప్రభాస్ నెక్స్ట్ మూవీ..? ‘

ప్రభాస్ ప్రస్తుతం ‘సాహూ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగష్టు 15 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రంతో పాటు ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో కూడా తన 20 వ చిత్రాన్ని కూడా మొదలుపెట్టేశాడు. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ రెండు చిత్రాలని కూడా ‘యూవీ క్రియేషన్స్’ సంస్థే నిర్మిస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలని కూడా ప్రభాస్ లైన్లో పెట్టడానికి రెడీ అవుతున్నాడట.

గతంలో దర్శకధీరుడు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణ అనే యువకుడు, ఇటీవల ప్రభాస్ ని కలిసి ఓ కథ వినిపించాడట. దీనికి ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించాడంట. ఇప్పుడు ప్రభాస్ యువ దర్శకులతో చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ‘యూవీ క్రియేషన్స్’ లోనే నిర్మించాలని చర్చలు జరుగుతున్నాయట. అంతేకాదు.. ప్రభాస్ కోసం కొరటాల శివ .. పూరి జగన్నాథ్ వంటి అగ్రదర్శకుల దగ్గర పనిచేసిన చాలా మంది యువకులు కూడా కథలు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నాడట… ఇక ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. మరి ప్రభాస్ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus