నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే ఎన్నో కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యల నడుమ ఈ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని ప్రాంతాలలోనూ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తెలంగాణ ఎన్నికలలో భాగంగా ఎంతోమంది సినీ సెలెబ్రిటీలో ఈ ఎన్నికలలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా ఓటు వేయడానికి ప్రతి ఒక్కరు రావాలి అనే సందేశాన్ని కూడా ఇచ్చారు. ఇలా టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇకపోతే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మాత్రం తన ఓటు హక్కు వినియోగించుకోలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఓటు వేయడానికి రాకపోవడంతో పలువురు ప్రభాస్ పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇలా హైదరాబాదులో ఉండి ఓటు వేయడానికి రాకపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదని మరికొందరు కొన్ని ఓల్డ్ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో ప్రభాస్ గురించి రాజమౌళి మాట్లాడుతూ ప్రభాస్ చాలా బద్ధకస్తుడని కామెంట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆయన ఏ పని చేయాలన్నా చాలా బద్ధకం అందుకే పెళ్లి కూడా చేసుకోలేదు అంటూ కామెంట్ చేశారు.
ఒక సినిమాల విషయంలోనే తన బద్ధకాన్ని పక్కన పెట్టి చాలా యాక్టివ్ గా పాల్గొంటారు. మిగిలిన ఏ పని చేయాలన్న ప్రభాస్ కి చాలా బద్ధకం అంటూ రాజమౌళి చెప్పారు. అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ అప్పట్లో రాజమౌళి చెప్పింది నిజమే ప్రభాస్ (Prabhas) తన బద్ధకం కారణంగానే వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకోలేకపోయారని కామెంట్స్ చేస్తున్నారు.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!