Prabhas: వైరల్ అవుతున్న ప్రభాస్ ఇన్ స్టా పోస్ట్.. ధన్యావాదాలంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సలార్ రిలీజ్ సందర్భంగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సలార్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ స్పందిస్తూ సలార్ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అని అన్నారు. సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించడం మా టీమ్ కు మీరిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తామని ప్రభాస్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కొరకు పని చేసిన ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించారని ప్రభాస్ అన్నారు.

అందుకే ఇంత గొప్ప అవుట్ పుట్ వచ్చిందని ప్రభాస్ కామెంట్లు చేశారు. ప్రేక్షకులు దీనిని ప్రశంసిస్తుంటే మా అందరికీ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని ప్రభాస్ చెప్పుకొచ్చారు. నేను ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తానని మీరంతా కొత్త సంవత్సరం వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని సలార్ ను ఆదరించినందుకు ధన్యవాదాలు అని ఆయన కామెంట్లు చేశారు. సాధారణంగా ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ (Prabhas) కొత్త సంవత్సరం కానుకగా ఈ పోస్ట్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు సలార్2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా 2025 సంవత్సరంలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. సలార్ శౌర్యాంగ పర్వం మూవీ వేరే లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.

సలార్1 మూవీ ఇప్పటికే 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా ఫుల్ రన్ లో ఈ సినిమా 800 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. యానిమల్ మూవీ కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. సలార్1 మూవీకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus