Prabhas: బ్రో మూవీ చూసి అలా ఫీలైన ప్రభాస్.. ఏం జరిగిందంటే?

  • August 3, 2023 / 04:24 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభాస్ తాజాగా థియేటర్ లో బ్రో మూవీ చూశారని తెలుస్తోంది. తన సన్నిహితులతో కలిసి థియేటర్ లో ప్రభాస్ ఈ సినిమాను వీక్షించి సినిమా బాగుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని సమాచారం అందుతోంది.

ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ప్రభాస్ గురించి పాజిటివ్ గా స్పందించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. స్టార్ హీరో ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సలార్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని ఈ సినిమా 3000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.

సలార్ మూవీ తమ నమ్మకాన్ని నిజం చేస్తుందని వాళ్లు భావిస్తున్నారు. సలార్ మూవీలో యాక్షన్ అంశాలకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రభాస్ రేంజ్ వేరు అని ప్రభాస్ సినిమాలకు పాజిటివ్ టక్ వస్తే మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలలో నటించడంతో పాటు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది.

ప్రభాస్ (Prabhas) రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ప్రభాస్ తన క్రేజ్ తో దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus