Prabhas: ఆ క్రేజీ సినిమాకు ప్రభాస్ పారితోషికంగా ఏకంగా రూ.200 కోట్లా?

స్టార్ హీరో ప్రభాస్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా ప్రభాస్ స్పిరిట్ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో సులువుగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. అందువల్ల ప్రభాస్ కు సులభంగా 200 కోట్ల రూపాయల పారితోషికం దక్కే అవకాశాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రభాస్ నిజంగానే తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకుంటారని అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ సలార్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోగా భవిష్యత్తు సినిమాలు సైతం ప్రభాస్ కోరుకున్న భారీ హిట్లను అందిస్తాయేమో చూడాల్సి ఉంది. ప్రాజెక్ట్ కే, సలార్2, స్పిరిట్, రాజా డీలక్స్ సినిమాలు వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని ఒక సినిమాకు మరో సినిమాకు పోలికలు కూడా ఉండవని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ (Prabhas) వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందుతున్నారు. సలార్ సినిమా ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈరోజు కలెక్షన్లతో ఈ సినిమా 500 కోట్ల రూపాయల కలెక్షన్లను క్రాస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ ఫుల్ రన్ పూర్తైన తర్వాత సలార్2 గురించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

బాహుబలి2 స్థాయిలో సలార్2 సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్2 మూవీ భాషతో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్2 సినిమా కథ మరింత కొత్తగా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus