యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి'(సిరీస్) తో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయాలంటే రూ.250 కోట్ల నుండి రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టాలి. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ వంటి చిత్రాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. 43 ఏళ్ళ వయస్సు వచ్చినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకుంది లేదు.
అప్పుడు చేసుకుంటా.. ఇప్పుడు చేసుకుంటా అంటూ ప్రభాస్ (Prabhas) చెబుతున్నాడు కానీ చేసుకోవడం లేదు. అందుకే ప్రభాస్ పై రూమర్స్ గట్టిగానే వస్తుంటాయి. పెళ్లి వార్తలు ఎలాగు రొటీనే. కానీ తాను నటించే సినిమాల హీరోయిన్లతో ప్రభాస్ చాలా సన్నిహితంగా ఉంటారని, మరీ ముఖ్యంగా ప్రభాస్ కు హీరోయిన్లు ఇట్టే అట్రాక్ట్ అయిపోతారని అంటుంటారు. ప్రభాస్ లో ఓ అమాయకత్వం ఉంటుందని, అదీకాక అతను ప్రతి ఒక్కరికీ చాలా మర్యాద, ప్రేమ పంచుతాడని అది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అంటూ సాహో హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ఆమె చెప్పింది కూడా చాలా వరకు నిజమే. అయితే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ప్రభాస్ అష్టకష్టాలు పడుతుంటాడని కూడా చాలా మంది హీరోయిన్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ముద్దు సీన్ల విషయంలో ప్రభాస్ చాలా వీక్. అందుకే ఆన్ స్క్రీన్ పై అలాంటి సన్నివేశాలు వద్దు అని ప్రభాస్ చెబుతుంటాడట. ఇప్పటి వరకు ప్రభాస్ .. ఇద్దరు హీరోయిన్లతో మాత్రమే లిప్ లాక్ చేశాడు. అందులో ఒకరు అనుష్క కాగా మరొకరు త్రిష కావడం విశేషం.
‘పౌర్ణమి’ సినిమాలో త్రిష – ప్రభాస్ ల మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ లో లిప్ లాక్ విజువల్ ఉంటుంది. అలాగే ‘బాహుబలి 2 ‘ లో హంసనావ పాటలో కూడా ప్రభాస్ – త్రిష ల మధ్య ఓ లిప్ లాక్ విజువల్ ఉంటుంది. ఈ ఇద్దరు హీరోయిన్లతో మాత్రమే ప్రభాస్ ఇప్పటివరకు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాడు.