నిశ్శబ్దం సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసింది అనుష్క. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటించాడు. దీంతో ఈ సినిమా పై ఇంకా అంచనాలు పెరిగాయి. టీజర్ , ట్రైలర్ వంటివి చాలా బాగున్నాయి. సెప్టెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ ల కోసం పెద్ద పెద్ద స్టార్స్ ను రంగంలోకి దించుతుంది యూవీ నిర్మాణ సంస్థ. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని వీక్షించి అద్భుతం అంటూ ప్రశంసించారు.
ఇక ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ సినిమా కోసం తాజాగా ప్రభాస్ కూడా రంగంలోకి దిగాడు. ఈ చిత్రంలో అనుష్క అన్విత రవళి శెట్టి అనే చెఫ్ పాత్రలో కనిపించబోతుంది. కాబట్టి చిత్రబృందం ఓ రెసిపీ ఛాలెంజ్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో తనకు ఇష్టమైన వంటలు అయిన మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోస రెసిపీలను ఎలా చేయాలో చేసి చూపించింది అనుష్క. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ రెసిపీలకి సంబంధించిన వీడియోలను అనుష్క పోస్ట్ చేయడం జరిగింది.
అదే క్రమంలో ప్రభాస్ కి ‘ఏదో ఒక రకమైన రెసిపీ చేయాలనే ఛాలెంజ్ ను కూడా విసిరింది. ప్రభాస్ ఫుడ్ లవర్ అని ఇండియా మొత్తం తెలుసు. ప్రభాస్ లో కూడా మంచి కుక్ ఉన్నాడు.తన కో స్టార్స్ కి, ఫ్రెండ్స్ కి మంచి మంచి వంటలు వండి వడ్డిస్తూ ఉంటాడు. అది తెలిసే అనుష్క అతనికి ఈ ఛాలెంజ్ విసిరింది.
ఈ క్రమంలో అతను ప్రాన్స్ పలావ్ ఎలా చేయాలనేది (Prabhas) ప్రభాస్ తెలిపాడు. అనుష్క తనకు చాలా కాలంగా తెలిసినా ఆమె ఫేవరేట్ డిష్ ఏంటనేది ఇప్పుడే తెలిసిందని ప్రభాస్ తన ఇన్స్టాలో పేర్కొన్నాడు. ఇక తన ఛాలెంజ్ ను చరణ్ కి ఫార్వర్డ్ చేస్తున్నట్టు కూడా ప్రభాస్ ఈ సందర్భంగా తెలియజేశాడు.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!