ఎన్టీఆర్ డైరెక్టర్ ను టార్గెట్ చేసిన ప్రభాస్.. ఫ్యాన్స్ కు పెద్ద షాకే…!

ప్రభాస్ ఏంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇవ్వడం ఏంటి.. అనుకుంటున్నారా? ఈ లాక్ డౌన్ టైం లో అందరూ హీరోలు ఏమో కానీ ప్రభాస్ మాత్రం తన అభిమానులకు కొత్త కొత్త సర్ప్రైజ్ లు ఇచ్చి ఖుషీ చేయించాడు. ‘సాహో’ ఫలితం తెలుగు ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచినా ఆ చిత్రం ఓపెనింగ్స్ పరంగా అసాధారణమైన రికార్డులను క్రియేట్ చేసింది. ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఫస్ట్ లుక్ తో అంచనాలను పెంచే ప్రయత్నం చేసారు నిర్మాతలు.

అయితే ఆ చిత్రం మరో నాలుగు నెలల్లో పూర్తయిపోతుంది అనే టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసారు. ఇదిలా ఉండగా… ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనె నటిస్తుంది అనే అనౌన్స్మెంట్ రావడంతో ఫ్యాన్స్ కు అదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.ఇక ఇటీవల ‘ఆది పురుష్’ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం కాబట్టి ఇది కూడా మంచి అనౌన్స్మెంట్ అనే చెప్పాలి. ఇక త్వరలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కూడా ప్రభాస్ సినిమా ఓ ప్రాజెక్ట్ సెట్ చేసి అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉందట.

ఆల్రెడీ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉంటుంది అని నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఇన్డైరెక్ట్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంతోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఖుషీ అయిపోయారు. అయితే ఇప్పుడు వారి ఆనందానికి ప్రభాస్ బ్రేక్ వేసేలా ఉన్నాడు అనే టాక్ కూడా జరుగుతుంది.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus