బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ బాహుబలిని హిందీలో పంపిణీ చేసారు. ఆ చిత్రాలకు భారీ లాభాలను అందుకున్నారు. అప్పటి నుంచి ప్రభాస్ తో సినిమా చేయాలనీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాహుబలి తర్వాత అడగగా ఇది వరకు ఇచ్చిన మాట ప్రకారం సుజీత్ కి సినిమా చేసిపెట్టాలని అతని అఫర్ ని ప్రభాస్ పక్కన పెట్టారు. ఆ తర్వాత ప్రభాస్ ని కరణ్ అడగగా.. రెమ్యునరేషన్ వద్ద కుదరక నో చెప్పారు. అయినా కరణ్ కి ఆశ చావలేదు. ప్రభాస్ తో స్ట్రైట్ హిందీ చిత్రం చేయాలనీ తపిస్తున్నారు. అందుకే మంచి కథని సిద్ధం చేసి.. స్వీయ దర్శకత్వంలోనే నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారంటా.
ఒక హీరోగా రణవీర్ సింగ్ ని ఫైనల్ చేశారు. పద్మావతి సినిమాతో ఇతను బాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అలాగే అమ్మాయిల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. సో ఇతను ఒకే.. రెండో హీరోగా ప్రభాస్ ని కరణ్ సెలక్ట్ చేసారంట. అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేస్తే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో చేస్తున్నారు. శ్రద్ధ కపూర్ తో పాటు అనేకమంది బాలీవుడ్ నటీ నటులు నటిస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత కరణ్ జోహార్, ప్రభాస్ మూవీ పట్టాలెక్కనుంది.