టాలీవుడ్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ విషయంలో టాప్ ఎవరనే ప్రశ్నకు ప్రభాస్ (Prabhas) పేరు సమాధానంగా వినిపిస్తుంది. ప్రభాస్ పారితోషికం 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. సినిమాను బట్టి, సినిమా బడ్జెట్ ను బట్టి ప్రభాస్ పారితోషికం తీసుకుంటున్నారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్ కు యశ్ (Yash) నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ రామాయణం కోసం మేకర్స్ యశ్ ను సంప్రదించి ఏకంగా 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఆఫర్ చేశారని భోగట్టా.
ఈ ఆఫర్ కు యశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. యశ్ ప్రస్తుతం టాక్సిక్ అనే క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. యశ్ నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో యశ్ నటిస్తుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
ప్రభాస్, యశ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (Rajamouli) రాజమౌళి, (Prashanth Neel) ప్రశాంత్ నీల్ తలచుకుంటే యశ్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమేం కాదు. యశ్, ప్రభాస్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. యశ్ వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే ఆయన కెరీర్ మరింత వేగంగా పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
యశ్ వేగంగా సినిమాలలో నటించాలని ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమాలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యశ్, ప్రభాస్ భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకుంటున్నారు. యశ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.