Prabhas: వైరల్ అవుతున్న వార్తల గురించి ప్రభాస్ క్లారిటీ ఇస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) సలార్(Salaar) , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)   సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేయగా ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలు సక్సెస్ సాధించడంతో బాక్సాఫీస్ కు సైతం జోష్ వచ్చిందని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోలతో ప్రభాస్ స్నేహపూర్వకంగా మెలుగుతారు. అయితే గోపీచంద్ నటించిన విశ్వం సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇస్తారంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ మధ్య కాలంలో గోపీచంద్ కు (Gopichand) సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. అందువల్ల ప్రభాస్ విశ్వం (Viswam) మూవీకి వాయిస్ ఓవర్ అందించి ఫ్రెండ్ కు తన వంతు సహాయసహకారాలు అందిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తల గురించి ప్రభాస్ క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. విశ్వం సినిమా, ది రాజాసాబ్ (The Raja Saab)  సినిమా ఒకే బ్యానర్ పై తెరకెక్కుతుండటం వల్ల కూడా ఈ తరహా వార్తలు ప్రచారంలో వస్తున్నాయని తెలుస్తోంది.

విశ్వం సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ అందిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. విశ్వం మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. పీపుల్స్ మీడియా బ్యానర్ నిర్మాతలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. విశ్వం సినిమాకు చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతం అందిస్తుండగా కావ్య తాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటిస్తున్నారు.

గోపీచంద్ 32వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా శ్రీనువైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనువైట్లకు (Srinu Vaitla) సైతం గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాతో శ్రీనువైట్ల సైతం కెరీర్ పరంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus