ప్రభాస్ (Prabhas) , సందీప్ వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రూపొందబోయే స్పిరిట్ (Spirit) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యానిమల్ తర్వాత సందీప్ రూపొందించబోయే ఈ మూవీపై మొదటి నుంచి హైప్ కొనసాగుతోంది. గత ఏడాది అధికారికంగా ప్రకటన వచ్చినా ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం సినిమా షురూ కావాలంటే ఇంకో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ది రాజాసాబ్ (The Rajasaab) , ఫౌజీ వంటి రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రెండు సినిమాలూ షూటింగ్ దశలో ఉండటంతో స్పిరిట్ ఆలస్యం అవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
అయితే మేకర్స్ మాత్రం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి, కాస్టింగ్ పనులు స్పీడ్‌గా చేపట్టినట్టు తెలుస్తోంది. గత నెలలో యూనిట్ విడుదల చేసిన కాస్టింగ్ కాల్ ప్రకటనకు పెద్దసంఖ్యలో కొత్తవాళ్లు మాత్రమే కాకుండా, ఇండస్ట్రీలో ఇప్పటికే ఉన్న నటులూ స్పందించారని సమాచారం. ఈ కాస్టింగ్ కాల్‌లో ప్రముఖ యాక్టర్ సుహాస్ (Suhas) పాల్గొన్నాడన్న రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై స్వయంగా సుహాస్ స్పందిస్తూ, “స్పిరిట్ సినిమా కోసం నేనేమీ ఆడిషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం నా ప్రాజెక్ట్స్‌లోనే బిజీగా ఉన్నాను” అని క్లారిటీ ఇచ్చాడు.
ఇదే సమయంలో మరో పేరుగా మంచు విష్ణు(Manchu Vishnu) కూడా ఈ సినిమా గురించి ఆసక్తి చూపించాడన్న వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎంపికపై మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రభాస్ జోడీగా నటించబోయే హీరోయిన్ పేరు ఇప్పటి వరకు ఖరారు కాలేదు. పలువురు టాప్ హీరోయిన్స్ పేర్లు వినిపించినా, మేకర్స్ ఇంకా ఎవరినీ కన్ఫర్మ్ చేయలేదు. విలన్, సపోర్టింగ్ రోల్స్ విషయంలో కూడా రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి. కానీ స్పిరిట్ స్థాయి ప్రాజెక్ట్ అయినందున, నటీనటుల ఎంపికపై సందీప్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.
ఈ వర్క్ ఫినిష్ కాబడానికి మరో నెల రోజుల సమయం పట్టేలా ఉందట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారిగా ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సందీప్ వంగా టేకింగ్, ప్రభాస్ మాస్ యాటిట్యూడ్‌కి మిక్స్ అయితే స్పిరిట్ పాన్ ఇండియా లెవెల్‌కి మించిన ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ మొదలయ్యాక టీజర్, ఫస్ట్ లుక్ వంటి అప్‌డేట్స్ మేకర్స్ అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం మిగిలిన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే స్పిరిట్ పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వెళ్లనుంది.