Prabhu Deva: డైరక్షన్‌పై షాకింగ్‌ డెసిషన్‌ తీసుకున్న ప్రభుదేవా!

డ్యాన్స్‌లో తనదైన శైలిలో ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ అనే పేరు తెచ్చుకున్నారు. సినిమా డ్యాన్స్‌లో ఆయన తీసుకొచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కాదు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్స్‌ ముందుకొచ్చి… ఇప్పుడు రాణిస్తున్నారు. ఆ తర్వాత నటనలోకి వచ్చారు. తన పెక్యూలియర్‌ నటనతో ఆకట్టున్నారు. ఆ తర్వాత మెగాఫోన్‌ పట్టి… వైవిధ్యమైన సినిమాలు తీశారు. అలాంటాయన…. ఇప్పుడు దర్శకత్వం నుండి తప్పుకుంటున్నారని టాక్‌. ప్రభుదేవా ప్రస్థానం గురించి చెప్పాలంటే డ్యాన్సర్‌గా అడుగుపెట్టి…

అగ్రహీరోలు మెచ్చిన కొరియోగ్రాఫర్‌గా మారారు. దర్శకత్వం ప్రారంభించి ఇండస్ట్రీ హిట్‌లు తీశారు. తెలుగు, తమిళమే కాదు, హిందీలోనూ అద్భుతమైన సినిమాలు తీశారు. హిందీ హీరోలతో తొడ గొట్టించారు కూడా. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు ఆశించిన మేర ఆకట్టుకోవడం లేదు. దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. అదే ఇందాక చెప్పినట్లు డైరక్షన్‌ వదిలేయండం. సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల ప్రభుదేవా తెరకెక్కించిన ‘రాధే’ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

దీంతో సల్మాన్‌ అభిమానులు ప్రభుదేవాను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. సాధారణ ప్రేక్షకులు కూడా అదే రీతిలో ఆడేసుకున్నారు. ఈ కారణమో, ఇంకేదో కారణమో కానీ… డైరక్షన్‌కు దూరంగా ఉందామని ప్రభుదేవా అనుకుంటున్నారనేది వైరల్‌ న్యూస్‌. మరి దీనిపై ప్రభుదేవా కానీ, ఆయన టీమ్‌ కానీ స్పందిస్తారేమో చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus