Upasana: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసనకు స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

మెగా కోడలు ఉపాసన త్వరలోనే తల్లి కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం 8 నెలల గర్భిణిగా ఉన్నటువంటి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు ఇలా మరి కొద్ది రోజులలో ఉపాసన తల్లి కాబోతున్న నేపథ్యంలో ఆ బిడ్డ రాక కోసం మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.రామ్ చరణ్ ఉపాసన వివాహం జరిగి దాదాపు పది సంవత్సరాల తర్వాత వీరు ఈ శుభవార్తను తెలియజేశారు.

ఇలా ఉపాసన రాంచరణ్ ఇద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం అభిమానులలో ఎంతో సంతోషాన్ని నింపింది ఇకపోతే ఉపాసనకు నెలలు నిండడంతో ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన విషయాలన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏ చిన్న విషయాన్ని షేర్ చేసిన వెంటనే వైరల్ అవుతుంది.

ఇక ఉపాసన (Upasana) మరి కొద్ది రోజులలో బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో ప్రజ్వల ఫౌండేషన్ వారు తనకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ఊయలను కానుకగా పంపించారు. ప్రస్తుతం ఉపాసన ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఊయలను తనకు పంపినందుకు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సునీత కృష్ణన్ ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజ్వల ఫౌండేషన్ సెక్స్ ట్రాఫికింగ్ లోచిక్కుకున్న మహిళలందరినీ రక్షించి వారికి ఆశ్రయం కల్పించడమే కాకుండా ఉపాధిని కూడా కల్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నటువంటి మహిళలు ఉపాసన బిడ్డ కోసం ఊయల తయారు చేశారు. ఇక దీనిని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ ఊయలను ఎంతో బలం, ధైర్యంతో, ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా గుర్తుంది పోతుందని తెలియజేశారు ఇక తన బిడ్డను కూడా ఇలాంటి వాటికి బహిర్గతం చేయడం తనకు ఇష్టమేనంటూ ఈమె తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus