కందకు లేని దురద కత్తికి ఎందుకు అనే సామెత ఇప్పుడు నాగబాబుకు సరిగ్గా సరిపోతుంది. ప్రకాష్ రాజ్ – పవన్ కళ్యాణ్ నడుమ రాజకీయ పరమైన స్పర్ధలు తలెత్తాయి. జీహెచ్ఎంసీ ఎలెక్షన్స్ లో పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి అందుకు కారణం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను ఊసరవెల్లి అని ప్రకాష్ రాజ్ అనడం పెద్దస్థాయి చర్చలకు దారితీసింది. ఈ గొడవలో కోపంతో భాగస్వామి అయ్యారు నాగబాబు, నా తమ్ముడిని అనే ముందు నీది నువ్వు చూసుకో..
నువ్వు నీ కుహానా రాజకీయాలు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు నాగబాబు. నాగబాబు రిప్లై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల చర్చనీయాంశం అయ్యింది. అయితే.. నాగబాబు పెడుసుగా పెట్టిన పోస్ట్ కు ప్రకాష్ చాలా మార్యాదపూర్వకంగా సమాధానమిచ్చాడు. నాగబాబు పెట్టిన పోస్ట్ కు కౌంటర్ కావడంతో మంచి తెలుగులో పోస్ట్ పెట్టి.. నాకు తెలుగొచ్చు కానీ.. మీ భాష రాదు అని గట్టిగా రిటార్ట్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్.
మరి నాగబాబు ఈ విషయమై ఎలా రెస్పాండ్ అవుతాడు, అసలు అవుతాడా లేదా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికి మాత్రం పైచేయి ప్రకాష్ రాజ్ దే. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయమై అటు ప్రకాష్ రాజ్ ను కానీ ఇటు నాగబాబును కానీ ఏమీ అనకపోవడం గమనార్హం.