“రివర్స్”లో వెళుతున్న “గుంటూర్ టాకీస్” దర్శకుడు

హాట్ హాట్ అందాలతో రశ్మీ రెచ్చిపోయిన “గుంటూర్ టాకీస్” చిత్రం అనుకున్నంత విజయం సాధించలేక పోయింది. అయితే ఈ సినిమాకు సరైన కధా, కధనం లేకపోవడం, అంతేకాకుండా నిడివి ఎక్కువుగా ఉండడం, కధను ఎటు తీసుకువెళ్ళాలో దర్శకుడికి పెద్దగా ఆలోచన లేకపోవడంతో సినిమాకు తొలి రోజే నెగేటివ్ టాక్ ను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే, ఈ విషయం ముందే తెలిసిన దర్శకుడు, నిర్మాతను బ్రతికించే క్రమంలో రేష్మి అందాల ఆరబోతనే పూర్తి నమ్ముకున్నాడు. ఈ సినిమాకు రేష్మి నే మార్కెట్…రేష్మి నే సెల్లింగ్ పాయింట్. అసలు చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీ..సీ సెంటర్స్ లో హాల్స్ ఫుల్ అవుతున్నాయి అంటే దానికి కారణం సైతం రేష్మి నే.

మరో పక్క ఈ చిత్రానికి ముందు దాదాపుగా 3సినిమాలు తీశాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు, అంతేకాకుండా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు, కానీ అదృష్టం కలసి రాలేదు..ఆ మూడు సినిమాలు పెద్దగా కమర్షియల్ సక్సెస్ లు కాకపోవడంతో రూటు మార్చేసి అడల్ట్ మూవీస్ మీద పడ్డాడు. అందుకోసమే ఈ చిత్రంలో రేష్మి ని ఆయుధంగా వాడుకున్నాడు. రేష్మి ను వాడుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు, కాస్త కాన్సెంట్రేషన్ కధ, కధనంపై పెట్టి ఉంటే ఫలితం వేరెలా ఉండేది. మరో పక్క ఇప్పుడున్న యువ దర్శకుల్లో క్రెజీ ప్రాజెక్ట్స్ హ్యాండల్ చేస్తున్న మారుతి కరియర్ సైతం బూతు డైలాగ్స్ తో కూడిన సినిమాలతోనే మొదలయింది. ఆ తరువాత ఆతను ట్రెండ్ మార్చి సినిమాలు చేస్తున్నాడు. కానీ ప్రవీణ్ దానికి పూర్తి బిణ్ణంగా ఫ్యామిలీ టు అడల్ట్ మూవీ చేశాడు. మరి ఈ అనుభవంతో అయినా ప్రవీణ్ వచ్చే సినిమాకు మంచి కధ, కధనాన్ని ఎంచుకుంటాడని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus