మలయాళంలో ఈ ఏడాది పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘ప్రేమలు’ (Premalu) . గిరీష్.ఎ.డి (Girish A. D.) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘భావన స్టూడియోస్’ బ్యానర్ పై ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), దిలీష్ పోతన్ (Dileesh Philip),, శ్యామ్ పుష్కరన్(Syam Pushkaran)..లు నిర్మించారు.విష్ణు విజయ్ సంగీతం అందించారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. కానీ మలయాళం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేసి మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజ్ చేశారు.
రాజమౌళి (Rajamouli) కొడుకు కార్తికేయ (S. S. Karthikeya) ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సంపాదించుకుని చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి ‘ప్రేమలు’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.66 cr |
సీడెడ్ | 1.12 cr |
ఆంధ్ర(టోటల్) | 2.00 cr |
ఏపీ +తెలంగాణ (టోటల్) | 6.78 cr |
‘ప్రేమలు'(తెలుగు) కేవలం రూ.1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.4 రోజులకే బ్రేక్ ఈవెన్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.6.78 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.5.18 కోట్ల లాభాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.