జూన్ 11 న ‘ప్రేమమ్’ టీజర్..!

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతు సరసన అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడోనా సెబాస్టియన్ లు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

మరోవైపు నాగార్జున, అమల పెళ్లి రోజును పురస్కరించుకొని జూన్ 11 న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసే యోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి గోపిసుందర్ స్వరాలు అందిస్తున్నాడు. మలయాళంలో హిట్ కొట్టిన ప్రేమమ్ చిత్ర తెలుగు రీమేక్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 12 న విడుదల చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus