రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

టాలీవుడ్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఏకంగా కాస్టింగ్ డైరెక్టర్ పై హీరోయిన్ తండ్రి చేయి చేసుకునే వరకు వెళ్ళింది వ్యవహారం. విషయంలోకి వెళితే.. ఇటీవల ‘ప్రేమిస్తున్నా’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సాత్విక్ వర్మ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ప్రీతీ నేహా హీరోయిన్ గా నటించింది.

Premisthunna

నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. చాలా మంది జనాలకి ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా తెలీదు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు హీరోయిన్ తండ్రి.. వెళ్లి కాస్టింగ్ డైరెక్టర్ తో గొడవ పెట్టుకుని సంచలనానికి తెర లేపాడు.

”ప్రేమిస్తున్నా’ సినిమా ఇప్పుడు బాగా ఆడుతుందని.. అందుకు కారణం తన కూతురు నటనే కారణం’ అంటూ హీరోయిన్ తండ్రి తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే తన కూతురికి మాత్రం పారితోషికం పూర్తిగా చెల్లించలేదని కూడా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో కాస్టింగ్ డైరెక్టర్ అయినటువంటి నగరి చలపతి పై దాడి చేశాడు హీరోయిన్ తండ్రి. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రతి దాడి చేయకుండా సదరు కాస్టింగ్ డైరెక్టర్ కామ్ గా వెళ్ళిపోతున్నప్పటికీ.. హీరోయిన్ తండ్రి కర్ర తీసుకుని కొట్టడాన్ని మనం ఈ వీడియోలో గమనించవచ్చు. ఇక అనంతరం నగరి చలపతి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. ‘ప్రేమిస్తున్నా’ సినిమా ఏమీ ఆడటం లేదని.. కానీ థియేటర్ కి వచ్చిన నలుగురు ప్రేక్షకులకైనా థాంక్స్ చెప్పాలని అతను చెప్పుకొచ్చాడు.

ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus