కన్ను కొట్టి కోట్ల మందిని అభిమానులుగా మార్చుకొన్న ప్రియ ప్రకాష్ వారియర్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలు క్యూ కట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి అయితే ఏకంగా కరణ్ జోహార్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న “టెంపర్” రీమేక్ లో హీరోయిన్ గా ప్రియా వారియర్ కి పిలిచి మరీ అవకాశమిచ్చాడు. అయితే.. అమ్మడు మలయాళ సినిమా “ఒరు కాదల్” కోసం చేసుకొన్న అగ్రిమెంట్ పుణ్యమా అని అది వీలవ్వలేదు.
ఇప్పుడు మన టాలీవుడ్ వంతు వచ్చింది. అమ్మడు వేరే సినిమాల్లో నటించలేదేమోనని ఏకంగా మలయాళ చిత్రాన్నే రీమేక్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఆల్రెడీ టాక్స్ పూర్తయ్యాయట, మలయాళంలో సినిమా విడుదలైన వెంటనే అక్కడి రిజల్ట్ ను బట్టి తెలుగులో ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తారట. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో హీరోలుగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా ప్సష్టత లేనప్పటికీ ప్రియా వారియర్ తెలుగులో నటించబోతోందనే వార్త వైరల్ అవ్వడంతో ఆమె సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఆనందంగా ఉన్నారు.