Priyamani: ‘పుష్ప 2’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • August 25, 2022 / 11:32 AM IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప: ది రైజ్'(పుష్ప-1) చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్ 2 లో వీళ్ళ కాంబినేషన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని సుకుమార్ ముందుగానే చెప్పాడు. దీంతో ‘పుష్ప: ది రూల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం భారీ స్థాయిలో బడ్జెట్ ను కేటాయించారు నిర్మాతలు.నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాలు భారీ సక్సెస్ అందుకోవడంతో ‘పుష్ప 2’ పై నార్త్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో మరింత టైం తీసుకుని బాగా డిజైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ విషయంలో కూడా సుకుమార్ చాలా శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తుంది.

‘పుష్ప 2’ మేజర్ భాగం చైనా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని భోగట్టా. ఈ క్రమంలో ‘పుష్ప2′ లో ఓ కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నట్టు ఆల్రెడీ ప్రచారం జరిగింది.ఇప్పుడు ప్రియమణి పేరు కూడా తెరపైకి వచ్చింది.’పుష్ప’ (పార్ట్-1) లో సునీల్, అనసూయ జోడిని నెగటివ్ రోల్స్ లో చూపించి ఆకట్టుకున్న సుకుమార్..

పార్ట్-2 లో విజయ్ సేతుపతి, ప్రియమణి.. ని జోడీగా పెట్టి నెగిటివ్ గా చూపించబోతున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ నిజమైతే మంచి సెలక్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరికీ పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. పెర్ఫార్మన్స్ విషయంలో ఇద్దరూ అదరగొట్టేస్తారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus