తన భార్య ప్రియాంక కు పబ్లిక్ గా లిప్ లాక్ పెట్టిన నిక్..!

మొన్నటికి మొన్న ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ విడాకులు తీసుకుంటున్నారంటూ ‘ఓకే’ అనే బ్రిటిష్ మ్యాగ్ జైన్ పెద్ద కథనం రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కథనం సృష్టించిన సంచలనం అంతా.. ఇంతా కాదు. ఇంటర్నేషనల్ వైడ్ పాపులారిటీ ఉన్న ఈ జంట పెళ్ళై ఆరు నెలలు కూడా అవ్వకుండా విడిపోవడమేంటని అందరూ షాకయ్యారు. అయితే ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని.. తేలిపోయింది. అంతేకాదు ఇప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగినట్టు స్పష్టమవుతుంది.

వివరాల్లోకి వెళితే.. ఇక తాజాగా బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ 2019 ఈవెంట్ లో ఈ జంట తెగ రచ్చ చేసింది. ఈ వేడుకకి నిక్.. ప్రియాంక సహా.. ఇతర నిక్ కుటుంబ సభ్యులు హాజరయ్యి తెగ సందడి చేసారు. నిక్ కూడా ఓ పాపులర్ సింగర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నిక్ అన్నదమ్ములు జో.. కెవిన్ జోనాస్ లు కలిసి జోనాస్ బ్రదర్స్ పేరుతో మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తుంటారు. ఇక ఈ కార్యక్రమంలో నిక్ తన ప్రియమైన సతీమణి కి లిప్ లాక్ పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరలవుతుంది. కపుల్ గోల్స్, బెస్ట్ కపుల్ అంటూ రకరకాల హాష్ తగులతో రచ్చ చేస్తున్నారు. ఇక ఈ వీడియో గనుక ఆ బ్రిటిష్ పత్రిక చూస్తే… వీరి పై మరోసారి ఇలాంటి కథనాలు రాయదనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus