Salma Hayek: 57 ఏళ్ళ నిర్మాత.. బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదుగా..!

సినిమా వాళ్ళు గ్లామర్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ఫామ్లో ఉన్నన్ని రోజులు ఈవెంట్లలో వాళ్ళు ఎక్కువగా కనిపించాల్సి ఉంటుంది. అది వాళ్ళ సినిమాల ఈవెంట్ అయినా లేదు అంటే అతిధిగా వెళ్లే సినిమా ఈవెంట్ అయినా కావచ్చు. కాబట్టి.. లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం లుక్స్ తేడాగా అనిపించినా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ రాయుళ్లు రెడీగా ఉంటారు. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసినట్టు అవుతుంది. సరే ఫామ్లో ఉన్నన్ని రోజులు సినిమా వాళ్ళు లుక్స్ విషయంలో జాగ్రత్తలు వహిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా మేల్ ఫిలిం మేకర్స్ 50 , ఫిమేల్ ఫిలిం మేకర్స్ 40 వరకు లుక్స్ విషయంలో జాగ్రత్తలు పడతారు. అంతకు మించి మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ ఓ నిర్మాత… అదీ 57 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ మెయింటైన్ చేస్తూ షాక్ ఇస్తుంది. అంతేకాదు బికినీలో కూడా ఆమె చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. సాల్మా హాయక్..అనే హాలీవుడ్ ప్రొడ్యూసర్ గురించి కొంతమంది వినే ఉంటారు.

‘వైల్డ్ వైల్డ్ వెస్ట్’ ‘ఒన్స్ అప్ ఆన్ ఎ టైం ఇన్ మేక్సిగో’ వంటి సినిమాలను నిర్మించింది. ఇంకా అనేక సినిమాల్లో నిర్మించింది. అయితే ఈమె వయసు ప్రస్తుతం 57 ఏళ్ళు. అయినప్పటికీ వన్నె తగ్గని అందంతో ఈమె దూసుకుపోతుంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ బికినీ వీడియో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus