Prudhvi Raj: ‘బ్రో’ తీసుకొచ్చిన అదృష్టం… పృథ్వీకి బంపర్‌ ఆఫర్‌!

‘బ్రో’ సినిమా పవన్‌ కల్యాణ్‌కు, సాయితేజ్‌కు, సముద్రఖనికి, త్రివిక్రమ్‌కు, టీజీ విశ్వప్రసాద్‌కు ఎంత ఉపయోగపడిందో తెలియదు కానీ.. ఒక్క నటుడికి మాత్రం చాలా ఉపయోగపడింది. అతనే పృథ్వీరాజ్. మొన్నీమధ్య వరకు 30 ఇయర్స్‌ పృథ్వీరాజ్‌ అని పిలిచేవారు. అయితే ఇప్పుడు ‘బ్రో’ సినిమా పుణ్యమా అని శ్యాంబాబుగా మారిపోయారు. సినిమాలోని ఓ పాటలో చిన్నగా కనిపించి, రెండు స్టెప్పులు వేసి, పవన్‌ కల్యాణ్‌ పాత్రతో తిట్లు కాసే పాత్ర అది. కానీ ఇప్పుడు ఆ పాత్ర బాగా ఫేమస్‌.

ఏపీ పాలిటిక్స్‌లో రీసెంట్‌ టైమ్‌లో ఊపు వచ్చిన అంశం శ్యాంబాబు వర్సెస్‌ రాంబాబు. అందులో శ్యాంబాబు పృథ్వీరాజ్‌ అయితే.. రాంబాబు అంటే ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఈ విషయాన్ని సినిమా ఓప్పుకోకపోయినా, ప్రస్తావించకపోయినా మంత్రి రాంబాబు మాత్రం వదలడం లేదు. వీలుచిక్కినప్పుడల్లా ఆ పాత్ర గురించి ప్రస్తావిస్తూ తన కోపం చూపిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రచ్చే పృథ్వీరాజ్‌కు (Prudhvi Raj) మంచి పాత్ర ఒకటి ఇచ్చింది అంటున్నారు. అంతేకాదు అది తనకు బంపర్‌ ఆఫర్‌ అని కూడా చెప్పారు.

‘శోభన్‌బాబు’ పేరుతో త్వరలో తెరకెక్కబోతున్న సినిమాలో ‘శ్యాంబాబు’ పాత్రను తీసుకుంటున్నారట. ఈ పాత్ర సినిమా ఏకంగా రెండు గంటలు ఉంటుందట. అలా మంచి ఛాన్స్‌ వచ్చింది అని పృథ్వీ ఓ వీడియో సందేశం ద్వారా చెప్పారు. దీంతో ఈసారి శ్యాంబాబు ఎంతటి రచ్చ చేస్తాడో అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. నిమిషం పాత్రకే ఏపీ పాలిటిక్స్ అలా మారితే… మరి రెండున్నర గంటలు అంటే ఇంకేమవుతుందో చూడాలి.

అయితే ఆ సినిమా చేస్తున్న రచయిత, దర్శకుడు ఎవరు? ఏ బ్యానర్‌లో ఉంటుంది? లాంటి వివరాలు పృథ్వీరాజ్‌ ఇంకా చెప్పలేదు. నా కెరీర్‌ను మలుపుతిప్పే చిత్రం అవుతుంది. ఈ శ్యాంబాబును అప్పుడు కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అంటూ వీడియో ముగించారు పృథ్వీ. ఈ స్పూఫ్‌ పాత్రలు కత్తి మీద సామే అంటుంటారు. మరి పృథ్వీ ఏం చేస్తారో చూడాలి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus