PS-1 Teaser: ఐ-ఫీస్టులా ‘పొన్నియిన్ సెల్వన్-1’ టీజర్..!

  • July 8, 2022 / 06:39 PM IST

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1′(పి.ఎస్-1).చియాన్ విక్రమ్‌, జ‌యం ర‌వి, కార్తీ, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి సూపర్ స్టార్లు నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న తమిళ, తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానుంది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది.

అంటే ‘బాహుబలి'(సిరీస్) ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్'(సిరీస్) లను మించి అన మాట. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ను కూడా విడుదల చేశారు. తెలుగు టీజర్ ను మహేష్ బాబు విడుదల చేయడం విశేషం. ‘పొన్నియిన్ సెల్వన్-1’ టీజర్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ కే పెద్దపీట వేశారు. కోటలు, సముద్రంలో పడవలు, గుర్రాలు, ఏనుగులు… వాటిపై కూర్చున్న వీరులు.. వాటినే ప్రత్యేకంగా చూపించారు. ‘ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం, అంతా దాన్ని మర్చిపోవడానికే..

ఆమెను మర్చిపోవడానికే, నన్ను నేనే మర్చిపోవడానికే’ అంటూ విక్రమ్ పలికిన ఒకే ఒక్క డైలాగ్ టీజర్ లో ఉంది. చోళ రాజ్యం కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు స్పష్టమవుతుంది. ఏ.ఆర్.రెహమాన్ అందించిన నేపధ్య సంగీతం…రవివర్మన్ సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది. మణిరత్నం మరియు సుబాస్కరన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ‘పొన్నియిన్ సెల్వన్-1’ టీజర్ ఒక ఐ-ఫీస్ట్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!


టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus