హీరో శ్రీకాంత్‌ ఇంట్లో సైకో వీరంగం!

  • September 24, 2017 / 01:55 PM IST

శ్రీకాంత్…మంచి ఫ్యామిలీ హీరోగా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ తాజాగా విలన్ గా సైతం మారాడు…యుద్దం శరణం అనే సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించి అందరినీ మెప్పించాడు…ఇక అదే క్రమంలో శ్రీకాంత్ ఇప్పుడు హీరోగానే కాకుండా మరికొన్ని సినిమాల్లో విలన్, మరియు ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ ఉన్నాడు…అలాంటి శ్రీకాంత్ పై అనుకోకుండా ఒక వ్యక్తి దాడి చేశాడు..ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి ఏమిటి ఆ కధ అంటే…కర్నూలు జిల్లాకు చెందిన బీ వెంకటేశ్ (29) పలువురు ప్రముఖుల ఇళ్లలో వంట మనిషిగా పనిచేశాడు. మూడు సంవత్సరాల క్రితం శ్రీకాంత్ ఇంట్లో కూడా వెంకటేష్ పని చేశాడు.

అతని పరిస్థితి..ప్రవర్తన నచ్చకపోవడంతో ఇంట్లో నుంచి పంపించి వేశారట శ్రీకాంత్ ఫ్యామిలీ.  కాకపోతే వెంకటేశ్ కు శ్రీకాంత్ అంటే చాలా అభిమానం.  తాజాగా  ఇక శ్రీకాంత్ తనకు తరచూ కలలోకి వస్తున్నాడని, ఎన్నిమార్లు కలిసేందుకు వెళ్లినా అనుమతించడం లేదని చెబుతూ, నిన్న శ్రీకాంత్ ఇంట్లోకి ప్రవేశించాడు. వాచ్ మెన్ అడ్డుకోవడంతో అతన్ని కొట్టి, అక్కడున్న ఏపీ 10 ఏఎస్ 0789, ఏపీ 09 సీఎల్ 9414 కార్లను ధ్వంసం చేశాడు. అదే సమయంలో కారు డ్రైవర్ పై దాడి చేసి ఇంట్లోకి వెళ్లాడు..ఆ సమయంలో మేడ దిగి వస్తున్న శ్రీకాంత్ ను మెడపట్టి మెట్లపై నుంచి తోశాడు. తృటిలో శ్రీకాంత్ కు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, అతి కష్టం మీద ఆ సైకోని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus