‘బిగ్‌బాస్‌’పై పునర్నవి కామెంట్స్‌ వైరల్‌!

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో ఉన్నన్ని రోజులు అందరి నోళ్లలో వారి పేర్లు నానుతూ ఉంటాయి. ఈసారి ఆమె గెలుస్తుంది.. ఈయన గెలుస్తాడు అంటూ వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఆ సెలబ్రిటీ స్టేటస్‌ అలానే ఉండిపోతుంది అంటారు. అయితే ఇది అందరి విషయంలో జరగడం లేదా… అందులో నటుల విషయంలో అస్సలు కుదరడం లేదా? కొంతమందిని చూస్తే నిజమే అనిపిస్తుంటుంది. ఇదే విషయాన్ని బిగ్‌బాస్‌ పాత సీజన్ల కంటెస్టెంట్లు కూడా చెబుతుంటారు. ఇప్పుడు పునర్నవి భూపాలం కూడా ఇదే మాట అంటోంది. బిగ్‌బాస్‌ వల్ల తనకు ప్రత్యేకంగా ఒరిగిందేం లేదు అని అంటోంది.

‘‘బిగ్‌బాస్‌ వల్ల నా యాక్టింగ్‌ కెరీర్‌కి ఎలాంటి హెల్ప్‌ జరగలేదు. సోషల్‌ ప్రొఫైల్ పెంచుకోవడంలో ఎలాంటి ఉపయోగం జరగలేదు. అయితే చాలామంది అభిమానులకు నేను చేరువయ్యాను’’అని చెప్పింది పునర్నవి. అయితే తాజా సీజన్‌లో ఇప్పటికే బయటకు వచ్చేసిన హౌస్‌మేట్స్‌ (సినిమా నేపథ్యం ఉన్నవారు) దివి, మోనాల్‌కి వరుస అవకాశాలు వస్తుండటం గమనార్హం. మరోవైపు పునర్నవి టమాడా మీడియా రూపొందిస్తున్న ‘కమిట్‌మెంటల్‌’ వెబ్ సిరీస్‌లో చేస్తోంది.

17 ఏళ్ల వయసులోనే ‘ఉయ్యాలా జంపాలా’తో కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన పునర్నవి… ఆ తర్వాత కొన్నాళ్లు అంతగా సినిమాల్లో కనిపించలేదు. కారణం ఆ టైమ్‌లో ఆమె ఎడ్యుకేషన్‌పై దృష్టిసారించడమే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే బిగ్‌బాస్‌కు ముందు తన కెరీర్‌ విషయంలో ఆమె చాలా సంతోషంగానే ఉందట. అయితే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు రావడం లేదనే పోలికలు చూసుకోవడం కంటే కెరీర్‌ను బిల్డ్‌ చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలనేదే తన ఆలోచనగా చెప్పింది. అంతేకాదు డ్యాన్స్‌ థెరపీలో మాస్టర్స్‌ చేయడం తన గోల్‌ అని కూడా చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus