‘మహర్షి’ ఫార్మేట్ నే ‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడా అప్లై చేస్తున్నారు..!

మహేష్ కెరీర్ ఇప్పటి వరకూ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘మహర్షి’ నిలిచింది. ఈ చిత్రంతో మొదటిసారి 100 కోట్ల షేర్ చిత్రాన్ని సాధించాడు మహేష్. చాలా రోజుల తరువాత 3 విభిన్న షేడ్స్ ఉన్న లుక్ లో మహేష్ కనిపించాడు. 2019 మే 9న విడుదలైన ఈ చిత్రం సమ్మర్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ ఫ్రెండ్ పాత్ర అత్యంత కీలకం అనే చెప్పాలి. ఆ పాత్రలో అల్లరి నరేష్ నటించాడు. అప్పటివరకూ ఓ ఫార్మేట్ లో వెళుతున్న సినిమా.. నరేష్ క్యారెక్టర్ తో కొత్త మలుపు తిరుగుతుంది. ఇక ఇదే ఫార్మేట్ ను ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా అప్లై చేస్తున్నారు.

ఈ చిత్రంలో కూడా మహేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ వల్ల మలుపు తిరుగుతుందట. ఈ పాత్రలో సత్యేదేవ్ నటిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఎన్నో విభిన్నమైన చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. సత్యేదేవ్. ఇటీవల పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ లో కూడా సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు మహేష్ ఫ్రెండ్ పాత్రలో కూడా సత్యదేవ్ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఈ చిత్రంలో మహేష్ పేరు సత్యదేవ్ పేరు ఒకటే ఉంటుందట. ఈ సినిమాతో సత్యదేవ్ కు మరిన్ని పెద్ద ఆఫర్లు రావడం ఖాయం అని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus