పూరీ జగన్నాథ్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్ర చిత్ర షూటింగ్లో భాగంగా గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక తరవాతి షెడ్యూల్ ను వారణాసి లో జరుపనున్నారని సమాచారం. యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్ , నాబా నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీజన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ గోవా షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్రబృందం పార్టీ చేసుకొన్న ఓ ఫోటోని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. కొద్ది సేపటికే ఈ ఫోటో వైరలవ్వడం విశేషం. దీనికి అసలు కారణం పూరి.. హీరోయిన్ నిధి అగర్వాల్ నడుము పై చెయ్యేసి ఉండడమే. ఈ ఫొటోలో పూరీకి ఓ వైపు ఛార్మి మరోవైపు నిధి ఉన్నారు. ఇక పూరి కుడి చేతిని ఛార్మి పట్టుకోగా.. అతడి ఎడమ చేయి నిధి అగర్వాల్ నడుము పై వేశాడు. అంతేకాదు పూరి ఆమె నడుముని గట్టిగా పట్టుకున్నట్లు ఈ ఫోటోలో స్పష్టమవుతుంది. ఇక ఇది చూసిన నెటిజెన్లు ఆగుతారా..? పూరీ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ‘ఇద్దరు పిల్లలున్నా అదేం పనులు పూరి’ అని కొందరు… ‘ఎన్ని ఫ్లాపులొచ్చినా .. పూరి ఆటిట్యూడ్ మారలేదంటూ’ మరికొందరు పూరిని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై పూరీ జగన్నాథ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus