విదేశీ నటులతో పూరి సినిమాలు..!

సాధారణంగా తెలుగు, భారతీయ నటులు విదేశీ సినిమాల్లో నటించడాన్ని గొప్పగా భావిస్తుంటారు. అందుకే ఇటు నుండి అటు వెళ్ళినవారు తప్ప అటు నుండి ఇటు వచ్చిన దాఖలాలు లేవు. దర్శకులు కూడా అటువంటి సాహసాలు చేసిన పాపాన పోలేదు. సెవెంత్ సెన్స్, కబాలి వంటి ఒకటి రెండు చిత్రాలు వీటికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు. అయితే తన తదుపరి సినిమాల్లో విదేశీ నటులు ఉంటారని చెప్పుకొస్తున్నారు పూరి జగన్నాధ్.

టాలీవుడ్ లో ఒకరిద్దరు తప్ప నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు పూరి జగన్నాధ్. చిరుతోను చేయలేదన్న లోటు తీరేదే.. చివరి నిమిషంలో ఆ అవకాశం చేజారిపోయింది. పూరి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న మహేశ్, ఎన్టీఆర్ లు కూడా ఇప్పుడు అతడితో సినిమా అంటే ఎటు తేల్చకుండా ఉన్నారు. దాంతో విసిగిపోయాడో ఏమోగానీ స్టార్స్ కోసం చూడకుండా తన తర్వాతి సినిమాలను తెలుగు, విదేశీ నటులతో కలిపి చేస్తానని అంటున్నారు. ఆ రకంగా పూరి మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారన్నమాట. ఇంతకీ పూరి తెచ్చే విదేశీ నటుల్లో థాయిలాండ్ వారు ఉంటారా..? పూరి ఫేవరేట్ స్పాట్ అయిన బ్యాంకాక్ థాయిలాండ్ దేశంలోనిదే మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus