Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’ .. 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) ఫస్ట్ వీకెండ్ అదీ లాంగ్ వీకెండ్ ను చాలా బాగా క్యాష్ చేసుకుంది. అల్లు అర్జున్ (Allu Arjun) నటన, సుకుమార్ (Sukumar)  టేకింగ్.. వంటి వాటికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ సినిమాను ప్రమోట్ చేసిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. మొదటి రోజు ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. రెండో రోజు, మూడో కొంచెం డౌన్ అయినట్టు కనిపించినా.. ఆదివారం నాడు ఆల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసింది.

Pushpa 2 The Rule Collections

కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడింది. కొన్ని ఏరియాల్లో ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు. ఒకసారి ‘పుష్ప 2’ ఫస్ట్ వీకెండ్ (Pushpa 2 The Rule) కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 45.92 cr
సీడెడ్ 14.80 cr
ఉత్తరాంధ్ర 10.80 cr
ఈస్ట్ 6.56 cr
వెస్ట్ 5.55 cr
కృష్ణా 6.94 cr
గుంటూరు 9.20 cr
నెల్లూరు 3.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 103.37 cr
కర్ణాటక 16.73 cr
తమిళనాడు 3.36 cr
కేరళ 8.05 cr
ఓవర్సీస్ 40.49 cr
నార్త్ 83.48 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 255.48 cr (షేర్)

‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు అంటే మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా రూ.348.22 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.256.78 కోట్ల షేర్ రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు. గుంటూరు, కృష్ణా, సీడెడ్ బాగానే ఉన్నా మిగిలిన ఏరియాల్లో ఆశించిన స్థాయిలో టికెట్లు తెగడం లేదు. కేరళలో కూడా ఈ సినిమా పెర్ఫార్మన్స్ చాలా వీక్ గా ఉంది. మరి వీక్ డేస్ లో ఎలా నిలబడుతుందో చూడాలి.

నేషనల్ అవార్డ్ కి మించిన అవార్డ్ ఏమైనా ఉందా బన్నీ

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus