Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పెళ్లి.. అసలైన వ్యక్తే క్లారిటీ ఇచ్చారుగా..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda) , నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)  మధ్య రిలేషన్‌షిప్ గురించి తరచూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ పుకార్లకు సరైన ఖండన లేకపోవడంతో రూమర్స్ ఎక్కువయ్యాయి. వీరిద్దరూ ఎప్పుడూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించకపోయినా, హాలిడే ట్రిప్స్, ఇతర సందర్భాల్లో బయటపడిన ఫోటోలు అభిమానుల ఊహలకు మరింత బూస్ట్ ఇస్తున్నాయి. అయితే తాజాగా విజయ్ తండ్రి గోవర్ధన్ దేవరకొండ ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చారు. గోవర్ధన్ మాట్లాడుతూ, విజయ్ ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు చెప్పారు.

Vijay Devarakonda

‘‘ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి  (Gowtam Tinnanuri)  దర్శకత్వంలో ‘VD12’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ మొదలవుతుంది. దిల్ రాజు (Dil Raju)  నిర్మాణంలో మరో సినిమా కూడా స్టార్ట్ అవుతుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం విజయ్ కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్లే దిశగా పయనిస్తుండగా, పెళ్లి గురించి ఆలోచించడానికి సమయం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే, రష్మికతో ఎంగేజ్మెంట్ జరగబోతుందనే వార్తలపై కూడా ఆయన స్పందించారు.

‘‘ఇది కేవలం పుకార్లే. విజయ్ కెరీర్ స్థిరపడిన తర్వాత మాత్రమే వ్యక్తిగత విషయాలను ఆలోచిస్తారు’’ అని వివరించారు. ఇదే విషయంపై విజయ్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘ప్రతీ రెండేళ్లకు ఒకసారి నాకు పెళ్లి పుకార్లు వస్తాయి. ఇవి ఎప్పుడు మొదలై, ఎప్పుడు ముగుస్తాయో నాకు అర్థం కాదు. ప్రస్తుతం నా దృష్టి సినిమాలపైనే’’ అని విజయ్ స్పష్టం చేశారు. ఇక రష్మిక మందన్న కూడా ఇటీవల తన రిలేషన్‌షిప్‌పై ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది.

‘‘ఇది అందరికీ తెలిసిన విషయం. మీరెందుకు అడుగుతున్నారో నాకు అర్థం అవుతోంది’’ అని పరోక్షంగా విజయ్‌తో ఉన్న సంబంధాన్ని సూచించింది. కానీ, వీరిద్దరూ ఈ విషయాన్ని నేరుగా ధృవీకరించలేదు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప 2’ సక్సెస్‌తో బిజీగా ఉంది. అటు ‘కుబేర (Kubera) ,’ ‘రెయిన్‌బో,’ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ వంటి సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus