అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 3వ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం మంచి కల్లెక్షన్లని రాబట్టింది.17వ రోజున కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లనే రాబట్టింది.
‘పుష్ప’ 17 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 36.50 cr |
సీడెడ్ | 14.00 cr |
ఉత్తరాంధ్ర | 7.80 cr |
ఈస్ట్ | 4.85 cr |
వెస్ట్ | 4.02 cr |
గుంటూరు | 5.23 cr |
కృష్ణా | 4.12 cr |
నెల్లూరు | 3.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 79.57 cr |
తమిళ్ నాడు | 8.85 cr |
కేరళ | 4.85 cr |
కర్ణాటక | 10.20 cr |
రెస్ట్ | 26.00 cr |
ఓవర్సీస్ | 12.25 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 141.72 cr |
‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.141.72 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు రూ.4.28 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆంధ్రలో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లు లాభాల బాట పట్టారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!