అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 3వ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం మంచి కల్లెక్షన్లని రాబట్టింది.
ఇప్పటికీ రాబడుతూనే ఉంది కూడా..! నిన్నటితో ఈ చిత్రం ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యింది. ‘పుష్ప’ 18 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 36.60 cr |
సీడెడ్ | 14.06 cr |
ఉత్తరాంధ్ర | 7.83 cr |
ఈస్ట్ | 4.87 cr |
వెస్ట్ | 4.04 cr |
గుంటూరు | 5.25 cr |
కృష్ణా | 4.14 cr |
నెల్లూరు | 3.06 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 79.85 cr |
తమిళ్ నాడు | 10.00 cr |
కేరళ | 4.95 cr |
కర్ణాటక | 10.25 cr |
రెస్ట్ | 29.00 cr |
ఓవర్సీస్ | 12.35 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 146.40 cr |
‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.146.40 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ పూర్తయినట్టే.! తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక్క తెలంగాణలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించింది. ఆంధ్రలో మాత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. టికెట్ రేట్ల ఇష్యు కారణంగానే ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదని స్పష్టమవుతుంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!