అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 3వ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్ళనే రాబడుతోంది.తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబడుతోంది ‘పుష్ప’..!
ఇక ఈ చిత్రం 3 వారాల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 36.75 cr |
సీడెడ్ | 14.30 cr |
ఉత్తరాంధ్ర | 7.90 cr |
ఈస్ట్ | 4.87 cr |
వెస్ట్ | 4.10 cr |
గుంటూరు | 5.30 cr |
కృష్ణా | 4.18 cr |
నెల్లూరు | 3.09 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 80.49 cr |
తమిళ్ నాడు | 10.50 cr |
కేరళ | 5.15 cr |
కర్ణాటక | 10.50 cr |
రెస్ట్ | 32.50 cr |
ఓవర్సీస్ | 13.00 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 152.14 cr |
‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.3 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.152.14 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.6.14 కోట్ల లాభాలను అందించింది కానీ ఆంధ్రలో బయ్యర్స్ మాత్రం భారీగా నష్టపోయారు.వాళ్ళకి ఎంత నష్టమొచ్చిందో అంతా తిరిగి చెల్లించబోతున్నట్టు నిర్మాతలు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!