ఐటెం సాంగ్స్ పై కన్నేసిన ఢిల్లీ భామ

మిల్కీ బ్యూటీ తమన్నా బాటలో నడిచేందుకు ఢిల్లీ భామ రాశీ ఖన్నా సై అంటోంది. పాల బుగ్గల సుందరి ఓ వై పు హీరోయిన్ గా నటిస్తూనే ఐటెం సాంగ్స్ లోను అందాలను ఆరబోస్తోంది. అదే విధంగా రాశీ స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి విజయాలను సొంతం చేసుకుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన సుప్రీమ్ సూపర్ హిట్ కావడంతో మంచి గిరాకీ ఏర్పడింది. తాజాగా హైపర్ లో రామ్ తో జోడీ కట్టి శెభాష్ అనిపించుకుంది.

దీంతో టాలీవుడ్ యువహీరోలందరూ రాశీని హీరోయిన్ గా కావాలని కోరుకుంటున్నారు.  ఇదే అదనుగా నిర్మాతలకు మంచి ఆఫర్ ఇచ్చిందీ భామ. తన బాడీ ల్యాంగ్వేజ్ కి సరిపోయే పాట ఉంటే ఆడిపాడేందుకు రెడీ అంటూ సంకేతాలు పంపిస్తోంది. రెమ్యునరేషన్ మాత్రం భారీగానే అడుగుతుందని ఫిలిం నగర్ వర్గీయుల టాక్. ఈ మధ్య తమన్నా తో పాటు కాజల్ కూడా ప్రత్యేక పాటలో నర్తించి మంచి పేరు తెచ్చుకుంది. భారీ రెమ్యునరేషన్ తో పాటు పేరు కూడా వస్తుండడంతో యువ నటీమణులు ఈ వైపు అడుగులు వేస్తున్నారు. మరీ రాశీ ఖన్నాకు ఐటెం సాంగ్ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus